రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసింది: KTR
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం మొదలవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు అందరి చూపు BRS వైపే ఉందన్నారు. రేవంత్ ప్రభుత్వ వచ్చి రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసిందని విమర్శించారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.