భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర మంత్రి

KNR: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝాలకు ఫోన్ చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయం నుండి ఆయా కలెక్టర్లకు పోన్లు చేసి ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.