ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన డీఎం
KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ పరిశీలించారు. బాన్సువాడ మండలంలోని సంగోజిపేట, హనుమాజీపేట్, కోనాపూర్ తదితర గ్రామాలలో శుక్రవారం ఆరబెట్టిన వరి పంటను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్నీ పరిశీలించి పూర్తిగా తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టాలని రైతులకు సూచించారు.