ఉయ్యూరులో YSR వర్ధంతి కార్యక్రమం

కృష్ణా: ఉయ్యూరు 5వ వార్డులో YSR 16వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి పూలమాలలు నేసి నివాళులర్పించారు. రాజకీయాల్లోకి రాకముందే రూపాయి డాక్టర్‌గా వైఎస్సార్ పేద ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారని చక్రవర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.