భీమవరంలో రాజీవ్ గాంధీకి ఘన నివాళులు

భీమవరంలో రాజీవ్ గాంధీకి ఘన నివాళులు

W.G: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి భీమవరంలో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ అంకెం సీతారామ్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్దులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.