మాజీ MLAకు రూ. 31 లక్షలకు టోకరా!

డిజిటల్ అరెస్ట్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ మాజీ MLA గుండప్ప వకీల్‌కు కూడా సైబర్ నేరగాళ్లు ఉచ్చుకు చిక్కారు. ఆయనను బెదిరించి 8 రోజుల్లో రూ.30.99లక్షలు దోచుకున్నారు. గుండప్పకు ఆగస్టు 12న CBI అధికారినంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. అనంతరం డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో పలు దఫాలుగా అతని నుంచి రూ. 31 లక్షలు కాజేశాడు.