స్వల్పంగా పెరిగిన పత్తి ధర
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల విరామం తరువాత ఈరోజు ప్రారంభం కాగా.. పత్తి ధర గత వారం కంటే ఇవాళ రూ. 50 పెరిగింది. సోమవారం మార్కెట్‌కు మొత్తం 12 వాహనాల్లో 124 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠంగా రూ. 7,550, కనిష్టంగా రూ. 6,000 ధర పలికింది. మార్కెట్‌లో కార్యకలాపాలను మార్కెట్ ఛైర్‌పర్సన్ స్వప్న, మార్కెట్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.