ఆ ఊరిలో తొలిసారి టెన్త్ పాసయ్యాడు!

UPకి చెందిన రామ్ కేవల్ ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో పాసయ్యాడు. నిజాంపూర్ ఊరు నుంచి టెన్త్‌లో పాసైన తొలి విద్యార్థి అతడే. బారాబంకీ జిల్లాలో ఉన్న ఆ ఊరిలో జనాభా 300 మందే. వారిలో పది వరకూ చదువుకున్న వారే తక్కువ. ఒకవేళ చదివినవారు కూడా ఫెయిలయ్యేవారు. అయితే పగలు పనిచేస్తూ రాత్రి చదువుకుంటూ రామ్ పది పాసయ్యాడు. దీంతో జిల్లా కలెక్టర్ ఆ విద్యార్థిని సత్కరించారు.