VIDEO: రాంనగర్‌లో బాలుడిపై కుక్కల దాడి

VIDEO: రాంనగర్‌లో బాలుడిపై కుక్కల దాడి

HNK: ఐనవోలు మండలం రాంనగర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కిరాణం షాపు నుంచి ఇంటికి వస్తున్న బాలుడు ఆకులపల్లి హరివర్ధన్‌పై సోమవారం వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.