మండలం వ్యాప్తంగా పొగమంచు
VZM: గరివిడి మండలంలోని అన్ని గ్రామాలను పొగమంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం 7 గంటలు దాటినా మంచుతెరలు వీడకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మంచు వల్ల మామిడి పూత నల్లగా మారి రాలిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు, వృద్ధులు మంచులో తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు.