సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

MDK: నారాయణఖేడ్ మండలం హనుమంతరావుపేట్ చేనేత సంఘ సభ్యులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సంఘం సభ్యులు మాట్లాడుతూ.. చేనేత అభివృద్ధికి సీఎం కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చేనేతకు పూర్వవైభవం వస్తుందని చెప్పారు.