పోరాటంలో రణ నినాదంలా వందేమాతరం: పవన్

పోరాటంలో రణ నినాదంలా వందేమాతరం: పవన్

AP: స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం రణ నినాదంలా నిలిచిందని DY CM పవన్ కళ్యాణ్ అన్నారు. బంకిమ్ చంద్ర గేయం దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడపడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులకు మనోబలాన్ని ఇచ్చిందని చెప్పారు. వందేమాతరం గేయం రేపటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని వెల్లడించారు. పోరాటస్ఫూర్తి నింపిన వందేమాతరం గురించి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.