షిఫ్ట్ఆపరేటర్లకు వేతనాలు పెంచాలి: CITU

CTR: ఏపీ విద్యుత్ శాఖలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. సోమవారం షిఫ్ట్ ఆపరేటర్లు విద్యుత్ శాఖ సీఎండి కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను కందారపు మురళి ప్రారంభించి మాట్లాడుతూ.. వాచ్మెన్ నుంచి షిఫ్ట్ ఆపరేటర్లుగా పదోన్నతి పొందినప్పటికి వాచ్మెన్లుగా పనిచేస్తుండడం శోచనీయమన్నారు.