VIDEO: అంతర్వేదిలో 35 వేల మందికి తాగునీరు: కలెక్టర్

VIDEO: అంతర్వేదిలో 35 వేల మందికి తాగునీరు: కలెక్టర్

కోనసీమ: జలజీవన్ మిషన్ ద్వారా అంతర్వేదిలోని 13 నివాస ప్రాంతాల్లో 35 వేల మందికి తాగునీరు అందిస్తామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అంతర్వేదిలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుడిమెల్లంక పథకం ద్వారా ఇప్పటికే 97 ప్రాంతాలకు నీరు అందుతోందని చెప్పారు. ఈ ప్రాంత భౌగోళిక సమస్యలను అధిగమించి తాగునీటి పరిష్కారానికి MLA వరప్రసాద్ ఎంతో కృషి చేశారన్నారు.