కరెంట్ షాక్‌తో ఆవు మృతి

కరెంట్ షాక్‌తో ఆవు మృతి

NGKL: వంగూరు మండలం డిండిచింతపల్లి గ్రామంలో గురువారం ఉగాది పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పెరుమాళ్ళ వెంకటచారి పాడిఆవు కరెంట్ షాక్‌తో మృత్యువాత పడింది. వెంకటనారాయణ పొలంలో ఆవు మేత మేస్తూ కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ తగిలింది. దాంతో ఆవు అక్కడికక్కడే చనిపోయింది. ఈ సంఘటనతో తనకు రూ.70 వేల నష్టం వాటిల్లిందని, జీవనాధారం పోయిందన్నారు.