ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

MDK: తూప్రాన్ మండలం వొట్టూరు గ్రామంలో పాంబండ బాబు (40) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. వ్యసనాలకు బానిసై తనకున్న ఆస్తిని పోగొట్టుకున్నాడని, దీనివల్ల కుటుంబ పోషణ కష్టంగా మారి మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.