పల్లెపోరు.. ఒక్క ఓటుతో దక్కిన విజయం

పల్లెపోరు.. ఒక్క ఓటుతో దక్కిన విజయం

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు మెజార్టీతో నక్క బుచ్చిరెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు. 2,049 ఓట్లు ఉండగా 1,834 పోలయ్యాయి. బుచ్చిరెడ్డికి 909 ఓట్లు, ప్రత్యర్థి కాంతారెడ్డికి 908 ఓట్లు వచ్చాయి. మొదటి నుంచి ఉత్కంఠగా జరిగిన ఓట్ల లెక్కింపులో చివరికి బుచ్చిరెడ్డి ఒక్క ఓటుతో గెలుపొందడం విశేషం.