'కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారాలు నమ్మొద్దు'
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 4వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పేర్ల జంపన్నకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం గడపగడపకు వెళ్లి ఓటును అభ్యర్థించారు. బీఆర్ఎస్ హయంలోనే తొర్రూరు మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.