VIDEO: నగరంలో గంజాయి బ్యాచ్ హల్‌చల్
HYD: కుల్సుంపుర PS పరిధిలో గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోయారు. జియాగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్ సమీపంలోని ఓ సందులో గంజాయి మత్తులో ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చి ఎదురుగా వచ్చిన ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం అతనిపై దాడి చేయడమే కాకుండా ఆటోలో ఉన్న వృద్ధులపై కూడా దాడికి యత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.