RO ప్లాంట్లను 45 రోజుల్లో పూర్తి చేయాలి: సవిత
AP: బీసీ గురుకులాలు, వసతిగృహాల్లో చేపట్టిన RO ప్లాంట్ల ఏర్పాట్లను 45 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 922 బీసీ వసతిగృహాల్లో RO ప్లాంట్లకు రూ.16.85 కోట్లు, 55 గురుకులాల్లో RO ప్లాంట్లకు రూ.3.44 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. విద్యార్థులకు సురక్షిత నీరు అందించడంలో ఆలస్యం జరగకూడదన్నారు.