నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎస్సై
WGL: నెక్కొండ మండల కేంద్రంలోని మూడో దఫా ఎన్నికల నేపథ్యంలో ఎస్సై మహేందర్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీస్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు 100 మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. సెల్ ఫోన్లు పోలింగ్ కేంద్రానికి తీసుకురావద్దన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.