పదవ తరగతి పరీక్షా సామగ్రి పంపిణీ

పదవ తరగతి పరీక్షా సామగ్రి పంపిణీ

PPM: పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్న గిరిజన విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పరీక్షా సామగ్రి కిట్లను పంపిణీ చేస్తున్నట్లు PO సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ సౌజన్యంతో జిల్లాలోని గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్ష కిట్లను బుధవారం పంపిణీ చేశారు.