VIDEO: శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మకు పూజలు
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల క్షేత్రంలో వన దుర్గమ్మ అమ్మవారికి సోమవారం ఇందువాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గుణ మాసం కృష్ణ పక్షం షష్టి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగా జలంతో అభిషేకం చేశారు. అనంతరం సుగంధ పరిమళాల పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.