జిల్లాలో నిరుద్యోగులకు శుభవార్త
NZB: జిల్లాలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు మంగళవారం తెలిపారు. దీనికి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చేసిన యువతి, యువకులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు మేళాలో పాల్గొనాలని సూచించారు. వయస్సు18 - 30 లోపు ఉన్నవారు సరైన ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని చెప్పారు.