బాలాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య
RR: బాలాపూర్ రాయల్ కాలనీలో నివాసముంటున్న మయన్‌మార్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి ముర్షీద్ అలంను అబ్దుల్లా అనే వ్యక్తి కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. పాత గొడవల కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి, నిందితుడు అబ్దుల్లా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.