పొన్నూరులో పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో
GNTR: పొన్నూరు మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు మండల ప్రజా పరిషత్ స్పెషల్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి డి.రాజు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.