త్వరలోనే చెరువు కట్ట నిర్మాణం: ఎమ్మెల్యే

TPT: దొరవారిసత్రం మండలం వేటగిరి పాలెంలో మంగళవారం ఎమ్మెల్యే విజయశ్రీ పర్యటించారు. వర్షాకాలంలో వరదల వలన తమ గ్రామం ముంపునకు గురవుతుందని, చెరువు కట్టను పూర్తిగా నిర్మించాలని గ్రామస్థులు కోరారు. వారి కోరిక మేరకు వేటగిరిపాలెం చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.