మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సర్పంచ్
BDK: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2400 రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ సీఈఓ యాఖుబ్ కోరారు. ఆళ్లపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ వాసం సుస్మిత, ఏఓ కుమార్ రాజా గురువారం ప్రారంభించారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు.