చైనాపై 50-100 శాతం సుంకాలు విధించండి: ట్రంప్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి నాటో సభ్యులంతా కలిసి రష్యాపై ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని, అప్పుడే తను కూడా ముందుకు వెళ్తానని తెలిపారు. అలాగే చైనాపై 50-100 శాతం సుంకాలను విధించాలని ఆదేశించారు. ఇది యుద్ధం ముగింపుకు గొప్ప సాయం చేస్తుందని అభిప్రాయపడ్డారు.