చంద్రశేఖరపురంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి

చంద్రశేఖరపురంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి

ప్రకాశం: చంద్రశేఖరపురంలోని CPM పార్టీ కార్యాలయంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. UTF నాయకులు మాలకొండయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అతిచిన్న వయసులోనే భగత్ సింగ్ చేసిన ప్రాణత్యాగం అజరామరమని, ఆయన పోరాట పటిమ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.