మహా యజ్ఞానికి మంత్రికి ఆహ్వానం
కృష్ణా: కోడూరు(మం) ఉల్లిపాలెంలోని శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్థానంలో 'శ్రీమన్నారాయణ మహా యజ్ఞం' నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఏఫ్రిల్ 19 నుంచి 29 వరకు చిన జీయర్ స్వామివారి, శంకర విజయేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామివారి దివ్య మంగళా శాసనములతో జరగనుంది. ఈ మేరకు ఆలయ అధికారులు మంగళవారం మంత్రి ఆనం నారాయణకు ఆహ్వాన పత్రిక అందజేశారు.