'సంస్కృతిక సంపదకు వనపర్తి మారుపేరు'
WNP: జిల్లా సంస్కృతిక సంపదకు మారుపేరు అని, వందల ఏళ్ల ఘన చరిత్ర ఈ జిల్లాకు ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. విద్యా సంస్థల్లో అప్పట్లోనే రిజర్వేషన్లు ఇచ్చారని, రైతుల కోసం ప్రాజెక్టులను ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు. వనపర్తి ప్రజలంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక అని హైదరాబాద్లో భావిస్తామని, అలాంటి జిల్లాలో ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారని ఆమె చెప్పారు.