బాధితులను పరామర్శించిన బాల్కొండ ఎమ్మెల్యే

బాధితులను పరామర్శించిన బాల్కొండ ఎమ్మెల్యే

NZB: వేల్పూర్‌లో సుదర్శన్ ఇంట్లో నిన్న పట్టపగలే జరిగిన దొంగతనం ఘటనపై బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఆయన సుదర్శన్ ఇంటికి వెళ్లి బాధితులను ఓదార్చి జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచే భీమ్‌గల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దొంగలను త్వరగా గుర్తించి, బాధితులకు న్యాయం చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు.