నందిగామలో ముగిసిన క్రైస్తవుల ఉపవాస దీక్షలు
NTR: నందిగామ గాంధీ సెంటర్‌లో శుక్రవారం గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాస్టర్లు యేసు ప్రభువు చేసిన త్యాగాల ప్రాముఖ్యతను వివరించారు. 40 రోజుల ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగిశాయని చెప్పుకొచ్చారు. ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.