BRSకు షాక్.. కాంగ్రెస్‌లో చేరికలు
ASF: చింతలమానేపల్లి మండలానికి చెందిన పలువురు భారత రాష్ట్ర సమితి (BRS) నాయకులు ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజాపాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. మండలంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.