వంతెన నిర్మాణ పనులు త్వరితగతిని పూర్తి చేయండి

ELR: ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వంతెన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశించారు. భీమడోలు మండలం గుండుగోలను వద్ద గోదావరి కాలువపై అసంపూర్తిగా నిలిచిన వంతెన నిర్మాణ పనులను నాయకులు, అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు నిలిచిపోవడానికి గల కారణాలను నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు.