ఐదేళ్ల బాలుడిపై విధి కుక్కలు దాడి

ఐదేళ్ల బాలుడిపై విధి కుక్కలు దాడి

KRNL: చిప్పగిరి మండలం నంచర్లలో ఐదేళ్ల బాలుడి( గౌతమ్)పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఒకే సారి ఐదు కుక్కలు బాలుడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా కుక్కలు దాడికి దిగాయని గౌతమ్ తల్లిదండ్రులు తెలిపారు. గమనించిన గ్రామస్థులు కుక్కలను తరమడంతో పెను ప్రమాదం తప్పింది. బాలుడిని గుంతకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.