బాధిత కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ

MHBD: జిల్లాలోని కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో శనివారం మంత్రి సీతక్క పర్యటించారు. పెనుగొండ గ్రామ శివారు కట్టుగూడెంకు చెందిన సీఐ సురేష్ తండ్రి వెంకటేశ్వర్లు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీతక్క మృతుని కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.