స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి: ఏబీవీపీ

NLG: దేవరకొండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నల్గొండ విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ యలమల గోపీచంద్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న రూ. 8500 కోట్ల ఫీజు రీయింబర్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలను చెల్లించకుండా తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు.