రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

SKLM: నందిగాం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. సీహెచ్.గోపాల్ టెక్కలి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.