రేపు సింగరేణిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
PDPL: సింగరేణి సేవా సమితి ఆర్జీ- 1 ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఆర్సీవోఏ క్లబ్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం జరగనుంది. ఆయుర్వేద స్పెషలిస్ట్ విశ్వనాధ మహర్శి చర్మవ్యాధులు, కీళ్లనొప్పులు, బీపీ, షుగర్ వంటి సమస్యలకు ఉచితంగా పరీక్షలు చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే ఈ శిబిరంలో మందులకు నామమాత్రపు ధర వసూలు చేస్తారు.