నామినేషన్ కేంద్రంలో ఏర్పాటు పరిశీలించిన అబ్జర్వర్
జగిత్యాల రూరల్ మండలం అంతర్గం క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ జనరల్ అబ్జర్వర్ రమేష్ పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించాలని ఎంపీడీవోతో కలిసి సమీక్షించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సిబ్బంది హాజరు, హెల్ప్ డెస్క్ పనితీరు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు.