'కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి'

CTR: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకమైన నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరికి వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21న అన్ని సీడీపీవో కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతున్నామన్నారు.