బుగ్గ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
ATP: తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున వెలసిన బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి కార్తీక మాస పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామిని నీలకంఠేశ్వరుడిగా అలంకరించి, వివిధ రకాల అభిషేకాలు, అర్చనలు చేశారు. కార్తీక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.