గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం గుంజనేరులో ఆదివారం గుర్తుతెలియని మృతదేహం లభించడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, డాగ్స్ స్క్వాడ్‌తో పరిశీలనలు చేపట్టారు. వారం రోజుల కిందటే మరణించి ఉండవచ్చని, మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో మృతుడి గుర్తింపుపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు.