ఆదిలాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేక రైలు
ADB: బీఆర్ అంబేద్కర్ వర్ధంతి మహాపరినిర్వాన్ దినోత్సవ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ముంబైకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. నాందేడ్ డివిజన్ పీఆర్‌వో రాజేశ్ ప్రకారం.. ఆదిలాబాద్–నాందేడ్–ముంబై మార్గంలో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. డిసెంబర్ 5న ఆదిలాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు దాదర్‌కు రైలు బయలుదేరుతుందన్నారు. డిసెంబర్ 7న దాదర్ నుంచి మధ్యాహ్నం 1.05కు ఆదిలాబాద్‌కు రైలు తిరిగి వస్తుంది.