సారపాక పంచాయతీలో రహదారి అధ్వానం.. వాహనదారుల ఆవేదన

BDK: బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలో గాంధీనగర్ రహదారి దయనీయ స్థితికి చేరింది. గుంతలతో నిండిన రోడ్డుపై ప్రయాణం చేయడం వాహనదారులకు కష్టసాధ్యమైపోయింది. ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకల సమయంలో ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొన్నదని వాహనదారులు పేర్కొన్నారు.