VIDEO: పంట పొలాల్లో అద్భుత దృశ్యం

VIDEO: పంట పొలాల్లో అద్భుత దృశ్యం

ప్రకాశం: బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలో తెల్లవారుజామున పంట పొలాల్లోకి నెమళ్లు గుంపులు గుంపులుగా వచ్చాయి. చుట్టుపక్కల ఉన్న కొండల ప్రాంతాల నుంచి ఆహారం వెతుక్కుంటూ ఈ నెమళ్లు గ్రామం వైపునకు రావడం జరిగింది. పచ్చని పంట పొలాల మధ్య నెమళ్లు తమ అందమైన ఈకలను విప్పుతూ, నాట్యం చేస్తున్నట్లుగా తిరుగుతున్న, ఈ అద్భుతమైన దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది.