బీద రవిచంద్రకు ఘనస్వాగతం

TPT: గూడూరు పట్టణంలో బుధవారం రాష్ట్ర ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పర్యటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మొదటిసారిగా గూడూరు నియోజవర్గ టీడీపీ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ స్వాగతం పలికారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను సన్మానించారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.