బావిలో పడి వ్యక్తి మృతి

KMM: ప్రమాదవశాత్తు బావిలో పడి ముదిగొండకు చెందిన యామాల రాము(40) మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ అయిన రాము నీరు తాగేందుకు గురువారం ఉదయం 11 గంటల సమయంలో బావి వద్దకు వెళ్లి జారి పడి చనిపోయినట్లు మృతుడి సోదరి కందిమళ్ల సరస్వతి ఫిర్యాదు మేరకు ముదిగొండ ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.